HMDA lands : శంషాబాద్ లో హెచ్ఎండిఏ భూములు కబ్జాకు యత్నం… అడ్డుకున్న అధికారులు

by Kalyani |
HMDA lands : శంషాబాద్ లో హెచ్ఎండిఏ భూములు కబ్జాకు యత్నం… అడ్డుకున్న అధికారులు
X

దిశ, శంషాబాద్ : హెచ్ఎండిఏ భూములలో యథేచ్ఛగా జెసిబిలు పెట్టి చదును చేస్తుండగా హెచ్ఎండిఏ అధికారులు అడ్డుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన శంషాబాద్ లో చోటుచేసుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సింప్లెక్స్ వద్ద ఉన్న హెచ్ఎండిఏ భూముల లోని సర్వేనెంబర్ 725 లో 8 ఎకరాల భూమిలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన షాబాజ్ అనే వ్యక్తి మరి కొంతమంది కలిసి మూడు జెసిబి లు పెట్టి కబ్జాకు యత్నిస్తున్నారని హెచ్ఎండిఏ సైట్ ఆఫీసర్ క్రాంతి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఫిర్యాదు ఆధారంగా ఘటన స్థలానికి వెళ్లి అక్కడ చదును చేస్తున్న మూడు జెసిబి లను స్వాధీనం చేసుకొని నిర్వాకుడు షాబాజ్ ను అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అక్కడ చదును చేస్తున్న మూడు జెసిబిలకు సంబంధించిన ముగ్గురు డ్రైవర్లు మహమ్మద్ రషీద్, నందు, మహమ్మద్ నిసార్ లను అరెస్టు చేసి, మూడు జెసిబిలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగిందన్నారు.



Next Story

Most Viewed