కాంగ్రెస్ నేతల అరెస్ట్

by Disha Web Desk 23 |
కాంగ్రెస్ నేతల  అరెస్ట్
X

దిశ,యాచారం : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఇబ్రహీంపట్నం చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నేతలు , ఎన్ ఎస్ యు ఐ విద్యార్థులు ఆదివారం ఆందోళన చేపట్టారు. ఐటి శాఖ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కిలోమీటర్ల మేర వాహనాలు రాకపోకలకు అంతరాయం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై వ్యతిరేక నినాదాలు చేశారు. పోలీసులు దర్నలో పాల్గొన్న వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సమయంలో పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు తోపులాట జరిగింది. ఈ సందర్భంగా టి పి సి సి ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన టీఎస్పీఎస్సీ చైర్మన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీలో ప్రభుత్వం హస్తం ఉందంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ధర్నాలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అధ్యక్షుడు ఆకుల నందు , బోసుపల్లి వీరేశం , మంకాల దాసు , ప్రవీణ్ కుమార్ , కౌన్సిలర్ శంకరయ్య , దొంతర మోని రాజు , ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షుడు నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.





Next Story