- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మీర్ పేట్ వెంకట మాధవి హత్య కేసులో మరో ట్విస్ట్ !

దిశ, మీర్ పేట్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెంకట మాధవి హత్య కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. నిందితుడు గురుమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. వెంకట మాధవిని నిందితుడు భర్త గురుమూర్తి పథకం ప్రకారమే హత్య చేసి అనంతరం శరీర భాగాలను ముక్కలుగా నరికి, ఎముకలను కాల్చి పొడి చేసి చెరువులో పడి వేసిన విషయం తెలిసిందే. హత్య ఒక్కడే చేశాడు అనుకుంటున్న వేళ మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. వెంకట మాధవి హత్యకు గురు మూర్తికి మరో ముగ్గురు కుటుంబ సభ్యులు సహకరించినట్లు A2 గా చెల్లలు సుజాత , A3 గా తల్లి సుబ్బలక్ష్మి, A4 గా తమ్ముడు కిరణ్ పేర్లను రిమాండ్ రిపోర్టులో జత చేశారని తెలుస్తుంది. అందులో భాగంగానే మీర్ పేట్ పోలీసులు కస్టడీ పిటిషన్ వేసి నిందితుడు గురుమూర్తిని విచారణ నిమిత్తం శనివారం మీర్ పేట్ పోలీసులు నాలుగు రోజుల కస్టడీకి తీసుకున్నారు.