శిథిలావస్థకు చేరిన పాత ట్యాంకు కూలేదాకా చూస్తారేమో..?

by Disha Web Desk 20 |
శిథిలావస్థకు చేరిన పాత ట్యాంకు కూలేదాకా చూస్తారేమో..?
X

దిశ, దౌల్తాబాద్ : మండల కేంద్రంలోని ప్రైమరి స్కూల్ వెనుక ప్రాంతంలో గల వాటర్‌ ట్యాంక్‌ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దీనిని తొలగించి దాని స్థానంలో కొత్త వాటర్‌ ట్యాంకును నిర్మించాలని కాలనీవాసులు కోరుతున్నారు. లక్ష లీటర్ల సామర్ధ్యం గల ఈ వాటర్‌ ట్యాంక్‌ను దాదాపు 40 సంవత్సరాల క్రితం నిర్మించారు. దీని ద్వారా గ్రామంలోని ఎస్సీ కాలనీ, తోక గేరి ఇతర కాలనీలతో పాటు హనుమాన్ టెంపుల్, పోలీస్ స్టేషన్ వరకు కుళాయి ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. గత సంవత్సం నుంచి ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరింది. పెచ్చులు ఊడిపోయాయి, పగుళ్లు ఏర్పడ్డాయి, గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుడు ట్యాంక్‌ లోపల శుభ్రం చేస్తుండగా ఇనుప కడ్డీలు విరిగి పడిపోయేలా పై కప్పు పెచ్చులు ఉడిపోవడం ప్రమాదంగా ఉన్నాయన్నారు.

వాటర్‌ ట్యాంక్‌ పక్కన ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఉన్నారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాలనీవాసులు ఎప్పుడు కూలుతుందోనని భయపడుతున్నారు. ఈ విషయంలో కాలనీవాసులు పంచాయతీ పాలకవర్గంతో పాటు గ్రామ ప్రజాప్రతినిధులకు విషయం వివరించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు వచ్చి దానిని పూర్తిగా తొలగించాలని పేర్కొన్నారు. తొలగించే ముందే దాని స్థానంలో మరోట్యాంకును నిర్మించాలని వారు ప్రతిపాదించారు. ప్రమాదకరంగా మారిన పాతట్యాంకును తొలగించాలని వారు కోరుతున్నారు. చాలా సంవత్సరాలు కావడంతో పాతవాటర్‌ ట్యాంకు ఏ క్షణమైన కూలవచ్చని, దాంతో కాలనీవాసులకు, పక్కనే ఉన్న పాఠశాల విద్యార్థులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.


Next Story