అమిత్ షా ఆత్మ విమర్శ చేసుకోవాలి.. ప్రజలకు సమాధానం చెప్పాలి: కాంగ్రెస్

by Dishafeatures2 |
అమిత్ షా ఆత్మ విమర్శ చేసుకోవాలి.. ప్రజలకు సమాధానం చెప్పాలి: కాంగ్రెస్
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: అమిత్ షా తెలంగాణ ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి డిమాండ్ చేశారు. గాంధీ భవన్ రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో అడుగు పెట్టె ముందు అమిత్ షా ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. టీఆర్ఎస్‌తో మీకు దోస్తీ ఉందో లేదో తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు. మీ పార్టీ వాళ్ళు కేసీఆర్‌పై చేసే ఆరోపణలపై చర్యలు ఎందుకు లేవు..? అని ప్రశ్నించారు. మీరు కేవలం ఓట్లు చీల్చి టీఆర్ఎస్‌కి లాభం చేయటానికే మీ ప్రయత్నమని ఆరోపించారు. తెలంగాణ లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. ఫార్మాసిటీ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని డిమాండ్ చేశారు.

ఇబ్రహీంపట్నం ,మహేశ్వరం నియోజకవర్గంలో ఫార్మాసిటీ నిర్మాణం లో మీ పాత్ర లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వేల ఎకరాల భూములను కేసీఆర్ అన్యాయం గా లాక్కున్నారని తెలిపారు. ఫార్మా పేరుతో కేసీఆర్ చేస్తున్న వ్యాపారం మీకు తెలియదా..? అని అన్నారు. కేసీఆర్ దళిత, బీసీ పేద ప్రజల నుండి ఎకరాకు 8 లక్షలకు తీసుకుని బహుళజాతి కంపెనీ లకు కోట్ల రూపాయలకు అమ్మిన విషయం మీకు తెలియదా జాతీయ బీసీ కమిషన్ ఫార్మా ప్రాంతంలో జరుగుతున్న అన్యాయలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఫార్మాసిటీ బాధిత ప్రాంతంలో సమావేశం పెట్టి ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీసీ కమిషన్ మీకు ఎం నివేదిక ఇచ్చింది ఇన్ని రోజులు అయిన ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదని అన్నారు.

మీ ప్రజాప్రతినిధులు ఫార్మ్‌కి వ్యతిరేకంగా ఇక్కడ నినాదాలు ఇవ్వటం ఢిల్లీ లో మీరు అనుమతులు ఇవ్వడం ఈ ద్వంద వైఖరి అర్థం ఏమిటన్నారు. మీకు చిత్తశుద్ది ఉంటే ఫార్మాసిటీ ని రద్దు చేయాలని అన్నారు. మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది… ఈడీ, సీబీఐ మీ చేతుల్లోనే ఉన్నాయి కదా చర్యలు తీసుకోండి అని చెప్పారు. మీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తాం అని పదే పదే అంటున్నారు. కేసీఆర్ అవినీతిపై వచ్చిన ఫిర్యాదులు మాత్రం మీరు పట్టించుకోరని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతిపై చర్యలు ఏవి..? సమావేశాల్లో కేసీఆర్‌పై అనటం కాదు దమ్ముంటే చర్యలు తీసుకుని చూపించండన్నారు.

కేసీఆర్‌తో మీకు స్నేహ బంధం లేకపోతే తక్షణమే చర్యలకు ఆదేశాలు ఇవ్వండని డిమాండ్ చేశారు. వరంగల్ సభలో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించిందన్నారు. రైతు రాజ్యమే ద్యేయంగా ఈ డిక్లరేషన్ ప్రకటించామని అన్నారు. ప్రజల నిత్యావసర సురుకులు అందని ద్రాక్ష లాగా మారాయని తెలిపారు.ఇక మీ మాయమాటలకు కాలం చెల్లిందన్నారు. ప్రజలు మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరని తెలిపారు.


Next Story

Most Viewed