స్వచ్ఛ సర్వేక్షన్​లో ఆమనగల్లుకు ర్యాంక్

by Disha Web |
స్వచ్ఛ సర్వేక్షన్​లో ఆమనగల్లుకు ర్యాంక్
X

దిశ, ఆమనగల్లు : స్వచ్ఛ సర్వేక్షన్ -2022లో వేగంగా స్వచ్ఛ భారత్ వృద్ధి విభాగంలో ఆమనగల్లు మున్సిపాలిటీకి 2వ ర్యాంకు దక్కినట్లు మున్సిపల్​ కమిషనర్ శ్యాంసుందర్ తెలిపారు. 25000-50000 జనాభా ఉన్న మున్సిపాలిటీ విభాగంలో కేంద్ర ప్రభుత్వం అందించే అవార్డులో అమనగల్లుకు రెండవ ర్యాంకు దక్కినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్యామ్ సుందర్ ను, మున్సిపాలిటీ సిబ్బందిని పాలకవర్గం సన్మానించింది. సన్మానించిన వారిలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు లక్ష్మణ్,విక్రమ్ రెడ్డి,సుజాత రాములు, విజయ్ కృష్ణ, చెన్నకేశవులు, సోనా జైరాం, కో ఆప్షన్ సభ్యులు శ్రీధర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed