ఆటో ఢీ కొట్టడంతో కోమాలోకి వెళ్లిన యువకుడు

by Disha Web Desk 11 |
ఆటో ఢీ కొట్టడంతో కోమాలోకి వెళ్లిన యువకుడు
X

దిశ, ఇబ్రహీంపట్నం :- రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగర కలాన్ సమీపంలో ఆటో ఢీ కొట్టడంతో యువకుడు కోమాలోకి వెళ్ళాడు. శుక్రవారం రోజున 11 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బానోత్ దుర్గాప్రసాద్ తండ్రి రవి వయస్సు 17సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. మంగళపల్లి నుండి కొంగరకలాన్ వైపు ప్రయాణిస్తుండగా టాటా ఏసీ ఆటో ఓవర్ టెక్ చేస్తూ కుడివైపు నుండి వస్తున్న దుర్గాప్రసాద్ బైకును తగిలింది. గాయాలు బలంగా తాకడంతో కోమాలోకి వెళ్ళాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆటో డ్రైవర్ పై ఆదిభట్ల పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

Next Story

Most Viewed