వివాహానికి వెళ్లి వస్తుండగా వ్యక్తి మృతి

by Dishaweb |
వివాహానికి వెళ్లి వస్తుండగా  వ్యక్తి మృతి
X

దిశ,యాచారం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మండలంలోని చింతపట్ల గ్రామానికి చెందిన వస్పరి పర్వతాలు (38) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అతని కి ఒక కుమారుడు ,ఒక కూతురు .అతని భార్యతో కలిసి తమ్మలోని గూడ సమీపంలోని ఫంక్షన్ హాల్ లో బంధువుల వివాహానికి హాజరై తిరిగి బైక్ పై ఇంటికి వెళ్తుండగా తక్కలపల్లి గేట్ వద్దకు రాగానే బైకు ముందు వెళ్తున్న కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి బైక్ కారుకు ఢీ కొట్టడంతో పర్వతాలు , అతని భార్య కిందపడ్డారు. దీంతో పర్వతాలు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన మాల్ లోని ఆసుపత్రి కి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ పర్వతాలు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగయ్య, ఎస్సై గోపాల్ పేర్కొన్నారు.
Next Story