- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
తెగిన విద్యుత్ వైరు షాక్ తగిలి.. వ్యక్తి మృతి
by Aamani |
X
దిశ,బొంరాస్ పేట్ : తెగిపడిన విద్యుత్ వైర్ తగిలి.. వ్యక్తి మృతి చెందిన ఘటన బొంరాస్ పేట్ మండలం లో చోటుచేసుకుంది. ఎస్ఐ రవూఫ్ తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని ఎన్కేపల్లి గ్రామానికి చెందిన సంగెం అంజిలయ్య(34) మంగళవారం ఉదయం తన పొలానికి వెళ్లగా, తన పొలానికి ఏర్పాటు చేసిన, విద్యుత్ వైరు తెగి పడింది. అది గమనించకపోవడం తో,అంజి లయ్య నడుచుకుంటూ వెళ్తుండగా,తెగిపడిన విద్యుత్ తీగ కాలికి తగలడంతో,ఎడమ కాలికి గాయమై,అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుని భార్య సంగెం లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవూఫ్ తెలిపారు.
Advertisement
Next Story