మూడు నెలల బాబుతో గృహిణి అదృశ్యం

by Disha Web Desk 12 |
మూడు నెలల బాబుతో గృహిణి అదృశ్యం
X

దిశ, దోమ: భోజనం విషయంలో భార్యాభర్తలిద్దరూ గొడవపడి మూడు నెలలు బాబుతో గృహిణి అదృశ్యమైన సంఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దోమ ఎస్ఐ విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని బుధ్లాపూర్ గ్రామంనికి చెందిన వాడిత్య శ్రీనివాస్(22) భార్య వాడిత్య అంబిక (21) భార్యాభర్తలిద్దరూ ఈ నెల 21వ తేదీ రాత్రి భోజన ఈ విషయంలో ఇద్దరు గొడవ పడ్డారు.

దీంతో భర్త భార్యను మందలించడంతో మరుసటి రోజు 22 తేదీ శ్రీనివాస్ పనికి వెళ్లిన తర్వాత అంబిక మూడు నెలల బాబుని తీసుకొని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. అంబిక ఎంతకీ ఇంటికి రాకపోవడంతో శ్రీనివాసుకు వాళ్ళ అమ్మ ఫోన్ చేసి చెప్పడంతో సాయంత్రం ఇంటికి వచ్చి తెలిసిన వారి దగ్గర, బంధువుల దగ్గర ఎంత వెతికారు. ఎంతకి ఆచూకీ లభించకపోవడంతో దోమ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విశ్వజన్ తెలిపారు.


Next Story

Most Viewed