కొట్టర కొట్టు హై లెస్స.. విజయవంతంగా బండలాగుడు పోటీలు..

by Disha Web |
కొట్టర కొట్టు హై లెస్స.. విజయవంతంగా బండలాగుడు పోటీలు..
X

దిశ, తలకొండపల్లి : గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు ఉట్టిపడేలా చుక్కాపూర్ లో ఆదివారం కాడెద్దులతో బండలాగుడు పోటీలను కొట్టరా కొట్టు హైలెస్సా అంటూ అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. గ్రామసమీపంలో వెలిసిన శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవ సందర్భంగా నాలుగురోజుల పాటు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం బండలాగుడు పోటీలకు దాతలు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి, తలకొండపల్లి సర్పంచ్ లలిత జ్యోతయ్య పదివేల చొప్పున, తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, వైయస్సార్ టీపీ ఇంచార్జ్ అర్జున్ రెడ్డి, ఖానాపూర్ ఎంపీటీసీ సరిత గణేష్ స్థానిక సర్పంచ్ దాసరి కిష్టమ్మలు 5000 చొప్పున ఆర్థిక సాయం అందించారు.

బండలాగుడు పోటీలలో కడారి వెంకటయ్య ఎద్దుల జంట 1835 ఫీట్లు లాగడంతో ప్రథమ బహుమతి కింద 15 వేల నగదు, నల్ల జంగయ్య ఎద్దుల జంట 1800 ఫీట్లు లాగడంతో ద్వితీయ బహుమతి కింద పదివేల నగదు, గోసల కృష్ణయ్య ఎద్దుల జంట 1500 ఫీట్లు దూరం లాగడంతో తృతీయ బహుమతి కింద 5 నగదును అందజేశారు. దేవాలయం సన్నిధిలో అంతకుముందు మధ్యాహ్నం అర్చకులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. బండలాగుడు పోటీలలో విజయం సాధించిన ఎద్దుల జంట యజమానులకు నగదుతో పాటు, శాలువాలతో ఘనంగా సన్మానించి బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ దాసరి కిష్టమ్మ, తలకొండపల్లి సర్పంచ్ లలిత జ్యోతయ్య, ఖానాపూర్ ఎంపీటీసీ సరిత గణేష్, ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ యాదయ్య, ఆలయ నిర్వాహకులు రంగారెడ్డి, భాస్కర్ రెడ్డి, కాలూరి ఆనందు , నరసింహ, శ్రీను, ప్రకాష్, రాములు, రాకేష్, శ్రీధర్ రెడ్డి, భీష్మ ,ఆలయ ఫౌండర్ ట్రస్ట్ వెంకటేశ్వర శర్మ, పూజారులు శ్యాంసుందర్ శర్మ, ఆంజనేయ శర్మ, రామ శంకర్ శర్మ, సుధాకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Next Story

Most Viewed