ఉచిత విద్యుత్ తో పాటు గృహాలకు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్​ : కసిరెడ్డి

by Disha Web Desk 11 |
ఉచిత విద్యుత్ తో పాటు గృహాలకు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్​ :  కసిరెడ్డి
X

దిశ, తలకొండపల్లి (కడ్తాల) : తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు తప్పకుండా అమలు చేస్తుందని, 24 గంటల కరెంటు తో పాటు గృహాలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ గా అందించబడునని కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తాల మండలంలోని మండల పార్టీ అధ్యక్షుడు బిచ్చ నాయక్ ఆధ్వర్యంలో సోమవారం కొండ్రి గాని బోడి తండా, మక్తమాదారం, మధ్యలకుంట తండా, రావిచేడు గ్రామాలలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, పీసీసీ సభ్యులు ఆయిల్ శ్రీనివాస్ గౌడ్, అర్జున్ రెడ్డిలతో కలిసి ఆయా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి, గడపగడపకు ఆరు గ్యారెంటీ పథకాలను వివరించారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలను మోసం చేసి, ఇచ్చిన పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా కాలం గడిపాడని ఎద్దేవ చేశారు. ఎన్నికల సమయం ఆసన్నమైంది కాబట్టి మరోసారి ముసలి కన్నీరు కారుస్తూ అధికార పార్టీ, బీజేపీలు మీ ముందుకు వస్తున్నాయని గతంలో 12 వందల రూపాయలు ఉన్న సిలిండర్ను, పెట్రోల్ డీజిల్ రేట్లను ఎన్నికల ముందే గుర్తుకొచ్చి తగ్గిస్తారా అని సూటిగా ప్రశ్నించారు. అధికార పార్టీ మాత్రం 400 కి సిలిండర్ అని చెప్పడం సిగ్గుచేటు అన్నారు.

తుక్కుగూడ ప్రాంతంలో సోనియాగాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను కాపీ కొట్టి కేసీఆర్ అవే పథకాలను మళ్లీ అటు ఇటు గా మార్చి మీ ముందుకు ఓట్లు అడగడానికి వస్తున్నాడని తస్మాత్ జాగ్రత్త గా ఉండాలని ప్రజలకు కసిరెడ్డి పిలుపునిచ్చారు. మన ప్రాంతంలో ఎక్కువ శాతం వరి పంట పండించే రైతులు ఉన్నారు కాబట్టి, వరికి మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 అదనంగా చెల్లిస్తుందని ఒక ఎకరాకు సుమారు 15 నుంచి 20 కింటాలు వరి ధాన్యం పడుతుందని రాఘవేందర్ రెడ్డి పేర్కొన్నారు.

రైతు పండించే వరి పంటకు ఎకరాకు సుమారు పదివేల చొప్పున అదనంగా లాభం జరుగుతుందని, రైతులకు మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెద్దపీట వేయడం జరిగిందని రాఘవేందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాట నరసింహ, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, హనుమాన్ నాయక్, భాస్కర్ రెడ్డి, అద్దాల రాములు, రావిచెడు సర్పంచ్ విటలయ్య గౌడ్, మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, సలాపూర్ సర్పంచ్ శంకర్ నాయక్,చల్లపల్లి మాజీ సర్పంచ్ పర్వతాలు యాదవ్, మాజీ సర్పంచ్ నరేందర్, డాక్టర్ శ్రీనివాస్, లక్ష్మణ్ నాయక్, వేణు పంతులు యాదయ్య వెంకటేష్, చెన్నయ్య, బాలరాజ్, నరసింహ గౌడ్, శ్రీరాములు తదితరులున్నారు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story