జాబ్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి

దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్‌ ప్రకటించడంతో నగరాల నుంచి స్వగ్రామాలకు చేరుకున్న వారికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్పించనున్నట్టు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జాబ్‌కార్డు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రంగారెడ్డి జిల్లాలో ఉపాధి హామీ పనుల పురోగతిపై జిల్లా పరిషత్ సీఈఓ, డీఆర్డీఏ పీడీ, డీపీవో, ఇంజినీర్లతో మంగళవారం అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో అందరికీ ఉపాధి కల్పించాలని ఆదేశించారు. అవసరమైన వారందరూ జాబ్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

Tags: Rangareddy, Additional collector, JObcards