- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RTC MD Sajjanar:ఎంతో మంది యువతకు రాజు ఆదర్శనీయం.. సజ్జనార్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బస్సులో ఇటీవల ఓ అంధ యువకుడు ‘ శ్రీ ఆంజనేయం’ మూవీలో పాటను అద్భుతంగా పాడిన విషయం తెలిసిందే. తన అద్భుతమైన గాత్రంతో బస్సులో ఉన్న వారిని అలరించారు. అతని పాటను విన్న ప్రయాణికులు చప్పట్లతో అభినందించారు. ఆ యువకుడు పాట పాడుతుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేయగా.. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి వెళ్లింది. అది చూసిన ఆయన దివ్యాంగ సింగర్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో ఆయన ఈ అంధ యువకుడుబస్సులో ఇటీవల ఓ అంధ యువకుడు ‘ శ్రీ ఆంజనేయం’ మూవీలో పాటను అద్భుతంగా పాడిన విషయం తెలిసిందే. తన అద్భుతమైన గాత్రంతో బస్సులో ఉన్న వారిని అలరించారు.అద్భుతంగా పాడారు.. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సర్ అని సజ్జనార్ కోరగా.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్పందించి ఇండియన్ ఐడల్ సీజన్ 4లో పాడుతాడు అని ప్రకటించారు.
దీంతో ఎండీ సజ్జనార్ థమన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అరుదైన టాలెంట్ కలిగిన అంధ యువకుడు రాజుని ప్రత్యేకంగా అభినందించి.. సత్కరించడం జరిగింది. ఈ క్రమంలో సజ్జనార్ మాట్లాడుతూ.. దృఢమైన సంకల్పం, సాధించాలనే పట్టుదల ఉంటే వైకల్యం ఏ మాత్రం అడ్డుకాదని నిరూపిస్తున్నారు గాయకుడు రాజు అని పేర్కొన్నారు. మధురమైన గాత్రమే కాదు.. పాటకు అనుగుణంగా ఎలాంటి వాయిద్యాల్లేకుండా తన చేతులు, కాళ్లతో సంగీతాన్ని అందిస్తోన్న ఈయన ప్రతిభ అద్భుతం అని కొనియాడారు. ఈ క్రమంలో ఎంతో మంది యువతకు రాజు ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.