గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు: నివేదిక విడుదల చేసిన రజత్ కుమార్

by Disha Web Desk 19 |
గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు: నివేదిక విడుదల చేసిన రజత్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని ఇరిగేషన్​ స్పెషల్ ​చీఫ్​సెక్రెటరీ రజత్​ కుమార్​వెల్లడించారు. శుక్రవారం ఈ ఏడాదికి సంబంధించిన గ్రౌండ్​ వాటర్​రిసోర్సెస్ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడేళ్లలో రాష్ట్రంలో సగటు భూగర్భ జలమట్టం 4.26 మీటర్లకు పైగా పెరిగిందని నివేదికలో తేలిందని, మొత్తం సేకరించిన భూగర్భ జలాల లభ్యత 680 టీఎంసీ దగ్గర ఉందన్నారు.

గతంతో పోల్చితే భూగర్భ జలాల వెలికితీత 8% తగ్గిందని, రాష్ట్ర ప్రభుత్వం పలు విధాలుగా చేస్తున్న ప్రయత్నాలతో నీటి మట్టాలు పెరిగాయని, మిషన్ కాకతీయ కింద 27472కు పైగా చెరువులను పునరుద్ధరించామని, కాళేశ్వరం ఎత్తిపోతలతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. చెరువులు నింపడం, చెక్​ డ్యాములు, పెర్కోలేషన్ ట్యాంకులు, ఇంకుడు గుంతల వంటి వాటితో నీటిమట్టాలు పెరిగాయన్నారు. ఈ భూగర్భ జల వనరుల వినియోగం కోసం పక్కా ప్రణాళిక వేస్తున్నామని, భూగర్భ జలాలు, పరిశ్రమలు, వ్యవసాయం, పంచాయతీ రాజ్​ శాఖలతో కూడిన సబ్​ కమిటీని ఏర్పాటు చేసినట్లు రజత్​ కుమార్​ వెల్లడించారు.


Next Story

Most Viewed