Raja Singh: ‘హిందూ వ్యతిరేక శక్తులు హిందువుల పండుగలను టార్గెట్ చేస్తున్నాయి’

by karthikeya |
Raja Singh: ‘హిందూ వ్యతిరేక శక్తులు హిందువుల పండుగలను టార్గెట్ చేస్తున్నాయి’
X

Raja Singh: ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనాలపై నిషేధం విధించడాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పుబట్టారు. ఈ విషయంలో వెంటనే ప్రభుత్వం ఓ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిమజ్జనాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి గైడ్‌లైన్స్ రాలేదని, వెంటనే దీనిపై సీఎం కచ్చితమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ‘‘హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో వినాయకచవితి జరుపుకుంటున్న ప్రజలంతా మీ వైపు, మీ ప్రభుత్వం వైపు చూస్తున్నారు. వాళ్లకోసం మీరు కచ్చితమైన ప్రకటన చేయండి.’’ అని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అంతేకాకుండా ఎన్నో ఏళ్ల నుంచి వినాయక నిమజ్జనాలు ట్యాంబ్‌బండ్‌ వద్ద కొనసాగుతున్నాయని, అలాంటప్పుడు ఉన్నట్లుండి కొత్త ఆర్డర్లు వినిపిస్తుండడం విడ్డూరమని, కేవలం హిందూ పండుగల విషయంలోనే ఇలా జరుగుతుండడం ఆలోచించాల్సిన విషయమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తుంటే హిందూ వ్యతిరేక శక్తులు హిందువుల పండుగలను మాత్రమే టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story