తెలంగాణకు వర్షసూచన.. వాతావరణశాఖ అలర్ట్

by Dishafeatures2 |
తెలంగాణకు వర్షసూచన.. వాతావరణశాఖ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గురువారం సాయంత్రం పలుచోట్ల జల్లులు కురిశాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు జిల్లాల్లో కొన్నిచోట్ల స్వల్ప వర్షం పడింది. అయితే రానున్న వారం రోజుల పాటు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

అటు నిన్న ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో 1.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. ఇక పలు ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

Next Story

Most Viewed