తెలంగాణకు వర్ష సూచన.. ఆ జిల్లాలకు అలర్ట్

by Rajesh |
తెలంగాణకు వర్ష సూచన.. ఆ జిల్లాలకు అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రేపు (మంగళవారం) వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరో వైపు రాష్ట్రంలో పగటి పూట ఎండలు తీవ్రంగా ఉంటుండగా.. రాత్రి మాత్రం చలితో జనం వణికిపోతున్నారు. తెలంగాణలో పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో చలి తీవ్రత పెరిగింది.

Next Story

Most Viewed