మృగశిర కార్తె రోజున తెలంగాణకు చల్లటి కబురు

by Dishanational2 |
మృగశిర కార్తె రోజున తెలంగాణకు చల్లటి కబురు
X

దిశ, వెబ్‌డెస్క్ : మృగశిర కార్తె సందర్భంగా వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు అందించింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ , నిజమాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, ఆయా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది. ఇక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

Next Story