బీఅలర్ట్ : రాష్ట్రంలో మరో ఐదు రోజులు దంచికొట్టనున్న వర్షాలు

by samatah |
బీఅలర్ట్ : రాష్ట్రంలో మరో ఐదు రోజులు దంచికొట్టనున్న వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఇప్పటికే వర్షాలు దంచి కొడుతున్న విషయం తెలిసిందే. వరణుడి ప్రతాపంతో లక్షల్లో పంట నేలపాలై, రైతన్నలకు కన్నీరే మిగిల్చింది. కాగా, రాగల 5 రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.వాతావరణంలో నెలకొన్న అనిశ్చితి, ద్రోణి ప్రభావంతో ఏర్పడిన క్యూములోనింబస్‌ కారణంగా భారీ వర్షాలు పడతాయని వివరించింది.

ఇక ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తారు వర్షాలు, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు పడనున్నట్లు సమాచారం. అందువలన ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Next Story

Most Viewed