రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో మోస్తారు వర్షాలు

by samatah |
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో మోస్తారు వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలు ఓ వైపు ఎండలు దంచి కొడుతుంటే మరో వైపు వరణుడు కూడా తన ప్రతాపం చూపెడుతున్నాడు. ఇటీవల తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు పలు చోట్ల మోస్తారు వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.

కాగా, రానున్న రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి చిరుజల్లుల నుంచి, మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.గ్రేటర్‌ హైదరాబాద్‌లో 37 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశాలున్నట్లు పేర్కొంది. దక్షిణ, ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నాయి.

Next Story

Most Viewed