కాసేపట్లో గన్నవరానికి రాహుల్ గాంధీ

by Seetharam |
కాసేపట్లో గన్నవరానికి రాహుల్ గాంధీ
X

దిశ,వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఖమ్మం సభకు బయలుదేరిన రాహుల్ గాంధీ మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్ పోర్టులో దిగనున్నారు. అనంతరం అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా ఖమ్మం కాంగ్రెస్ సభకు చేరుకుంటారు.

ఆయన 4 గంటలకు ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు విమానంలో చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు ఖమ్మంలోని బహిరంగ సభ ప్రాంగణానికి రాహుల్ రానున్నారు. అనంతరం సభలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగిస్తారు. రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు టీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు.

Next Story