తెలుగు భాషలో చరిత్ర ఉంది.. రాహుల్ గాంధీ ప్రశంసలు

by Gantepaka Srikanth |
తెలుగు భాషలో చరిత్ర ఉంది.. రాహుల్ గాంధీ ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు భాషపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. అక్కడి భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాషలో చరిత్ర, సంస్కృతి ఉన్నాయన్నారు. హిందీ భాషను తెలుగు రాష్ట్రాలపై రుద్దారని చెప్పారు. తెలుగు భాష ముఖ్యం కాదంటే.. ఆ ప్రాంత ప్రజలను అవమానించడమేనని అన్నారు. భారత దేశానికి ఒకే భావాజాలం ఉందని.. అదే ఆర్ఎస్ఎస్ భావిస్తుందని, తాము మాత్రం భిన్న భావజాల కేంద్రమని భావిస్తామని అన్నారు.

భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని, కానీ ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ సమస్య లేదని ప్రస్తావించారు. ఈ క్రమంలో చైనాలో నిరుద్యోగ సమస్య లేదు. వియత్నాంలో కూడా లేదన్నారు. 40, 50, 60 దశకాలలో ప్రపంచ ఉత్పత్తికి అమెరికా కేంద్రంగా నిలిచిందన్నారు. తయారు చేసిన ఏదైనా కూడా ఇక్కడ తయారు చేయబడిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఉత్పత్తి అమెరికా నుంచి మారిందన్నారు. అమెరికాలో తయారయ్యే వస్తువులు ఇప్పుడు కొరియా, జపాన్, చైనాలకు మారాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఉత్పత్తిలో చైనా అందరినీ దాటేసి నిరుద్యోగాన్ని అధిగమించి దూసుకుపోతుందని రాహుల్ అన్నారు.

Advertisement

Next Story