రాహుల్ గాంధీ దయచేసి ఇది చెప్పండి: కేటీఆర్

by Mahesh |   ( Updated:2024-12-11 06:35:42.0  )
రాహుల్ గాంధీ దయచేసి ఇది చెప్పండి: కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ట్యాగ్ చేస్తూ.. మరో ట్వీట్ చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), అదానీ (adani)దోస్తీ.. అంటూ నిరసన వ్యక్తం చేస్తూ టీ షర్ట్స్ వేసుకొని బీఆర్ఎస్(BRS) నాయకులు తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా పోలీసులు వారిని అడ్డుకుని.. అసెంబ్లీలోకి అనుమతించలేదు. టీ షర్టులు(T-shirts) వేసుకొని సభ లోకి వెళ్ళడానికి వీలు లేదని తేల్చి చెప్పడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) నిరసనకు దిగారు. దీంతో వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై ట్విట్టర్ ద్వారా రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రస్తుత పార్లమెంట్ సెషన్ లో ప్రతి రోజు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు.. ప్రధాని మోడీ, అదానీ దోస్తీ అంటూ టీ షర్టులను వేసుకొని వెళ్లి.. నిరసన చేస్తున్నారు. ఇదే విషయంపై ప్రశ్నిస్తూ కేటీఆర్(KTR) తన ట్వీట్ లో " ప్రియమైన రాహుల్ గాంధీ ఇది ఎలాంటి ద్వంద్వ వైఖరి.. మీరు పార్లమెంట్‌లో ఆదానీ-మోదీ చిత్రంతో టీ-షర్ట్ ధరించడం సరైనదైతే, మేము తెలంగాణ అసెంబ్లీలో అదానీ-రేవంత్ వ్యవహారాన్ని బయట పెట్టడం ఎందుకు అనుమతించడం లేదు? దయచేసి చెప్పండంటూ కేటీఆర్ ఇరువురి ఫోటోలు షేర్ చేస్తూ రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed