గూస్‌బంప్స్ తెప్పిస్తున్న రాహుల్ గాంధీ సాంగ్ (వీడియో)

by Disha Web Desk 2 |
గూస్‌బంప్స్ తెప్పిస్తున్న రాహుల్ గాంధీ సాంగ్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన ప్రతిష్టాత్మక 'భారత్ జోడో యాత్ర' తెలంగాణలోకి ప్రవేశించింది. మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా బ్రిడ్జి మీదుగా తెలంగాణలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి బతుకమ్మలు, బోనాలు, డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణలో రాహుల్ గాంధీ యాత్రకు స్వాగతం పలికేలా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఆ పాటలోని లిరిక్స్ రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: జోడో యాత్రను ఏ శక్తీ ఆపలేదు: రాహుల్ గాంధీ


Next Story

Most Viewed