ఓబీసీలను కించపరిచేలా రాహుల్ వ్యాఖ్యలు : కె. లక్ష్మణ్

by samatah |
ఓబీసీలను కించపరిచేలా రాహుల్ వ్యాఖ్యలు :   కె. లక్ష్మణ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి ప్రధాని కావడం రాహుల్ గాంధీకి ఇష్టం లేదని, అందువల్లే ఓబీసీ కమ్యూనిటీకి చెందిన నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో భారతదేశాన్ని ప్రపంచ వేదికలపై నిలబెట్టడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు శిక్ష విధించిన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన లక్ష్మణ్.. రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాహుల్ గాంధీ మొత్తం ఓబీసీ కమ్యూనిటీని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్నారు. ఓబీసీల పరువు తీసేలే రాహుల్ గాంధీ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబీసీలు అంటే కాంగ్రెస్ పార్టీకి ద్వేషం అని అందువల్లే ఓబీసీ వర్గానికి చెందిన మోడీ ప్రధాని అయితే ఆ పార్టీ ఓర్చుకోలేకపోతోందని ఆరోపించారు.

Next Story