కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్‌ను పరిశీలించిన పంజాబ్ సీఎం

by Disha Web Desk 4 |
కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్‌ను పరిశీలించిన పంజాబ్ సీఎం
X

దిశ, సిద్ధిపేట ప్రతినిధి : కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గురువారం పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరును రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ పంజాబ్ సీఎంకు వివరించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలో 15 టీఎంసీల సామర్థ్యంతో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మించారు.

కాళేశ్వరం నుంచి 618 మీటర్ల ఎత్తులో కొండపోచమ్మ సాగర్ ఉంది. 2,85,280 ఎకరాలకు సాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారా అందించనున్నారు. 6 పంపులతో కొండ పోచమ్మ సాగర్ పంప్ హౌస్ నిర్మించారు. 34 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఒక్కో మోటర్ ద్వారా నీటిని ఎత్తిపోస్తారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed