పెరిగిన గ్యాస్ ధరలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

by Dishanational2 |
పెరిగిన గ్యాస్ ధరలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేపట్టింది. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు అధికార పార్టీ నాయకులు మహాధర్నా చేపట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని బీఆర్ఎస్ మహిళలు మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్లు, కట్టెల మోపులతో వినూత్నంగా నిరసన తెలియజేశారు.

రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైనే కట్టెల పొయ్యి ఏర్పాటు చేసి వంటలు చేశారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. 2014లో రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను 1200కు పెంచి.. ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. మహిళ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మహిళలకు పెంచిన గ్యాస్ ధరలను గిఫ్ట్‌గా ఇచ్చిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రానికి కనువిప్పు కలిగి పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన ధరలతో తిరిగి కట్టెల పొయ్యిపై వంట చేసుకునే రోజులు వస్తున్నాయని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed