హైకోర్టు తీర్పును స్వాగతించిన ఓబీసీ మోర్చా.. సీఎం వైఖరిని ఖండిస్తూ పూలే విగ్రహం ఎదుట నిరసన

by Ramesh Goud |
హైకోర్టు తీర్పును స్వాగతించిన ఓబీసీ మోర్చా.. సీఎం వైఖరిని ఖండిస్తూ పూలే విగ్రహం ఎదుట నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో: రిజర్వేషన్లపై కలకత్తా హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ.. బీజేపీ నాయకులు జ్యోతిబాపులే విగ్రహానికి పూల మాలలు వేసి సంబరాలు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముస్లిం ఉపకులాలకు ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు ఇవ్వడం, రాజ్యాంగ వ్యతిరేకమని కలకత్తా హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపధ్యంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ హైదరాబాద్ అంబర్ పేటలోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కే లక్ష్మణ్, ఆనంద్ గౌడ్ సహా పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్న మమత బెనర్జీ అనుచిత వైఖరిని ఖండిస్తూ బెంగాల్ సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. అంతేగాక పూలే విగ్రహం ఎదుట తెలంగాణ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

Next Story

Most Viewed