ప్రాజెక్టుల సలహాదారు రంగారెడ్డి కన్నుమూత.. CM రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్

by Rajesh |
ప్రాజెక్టుల సలహాదారు రంగారెడ్డి కన్నుమూత.. CM రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి పాలమూరు జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల సలహాదారు రంగారెడ్డి(73) సోమవారం కన్నుమూశారు. కాగా, ఆయన మృతి పట్ల ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సాగునీటిరంగ నిపుణుడు, ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టుల రూపశిల్పి రంగారెడ్డి గారి మరణం బాధాకరం అన్నారు. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన సేవలను వినియోగించుకోవాలని ఇటీవలే సాగునీటి సలహాదారుడిగా నియమించామని గుర్తుచేశారు. ఆయన మరణించడం పాలమూరు జిల్లాకు తీరని లోటు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Next Story

Most Viewed