అధిక ఫీజు వసూలు చేసిన కాలేజీలకు భారీగా ఫైన్

by Disha Web Desk 7 |
అధిక ఫీజు వసూలు చేసిన కాలేజీలకు భారీగా ఫైన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : అధిక ఫీజులు వసూలు చేస్తున్న 15 ఇంజినీరింగ్ కాలేజీలపై ఫీజుల నియంత్రణ కమిటీ జరిమానా విధించింది. ఎంతమంది విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేశారో విచారించింది. ఈ క్రమంలో ఫీజులను వసూలు చేసిన కాలేజీ యాజమాన్యాలకు రూ. 2 లక్షల చొప్పున జరిమానా విధించింది. మొత్తం 26 ఇంజినీరింగ్ కాలేజీలపై ఫీజుల నియంత్రణ కమిటీకి ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. దీంతో, ఆయా కళాశాల యాజమాన్యాలను కమిటీ విచారించింది. ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో ప్రకారం ఫీజులు వసూలు చేయాలని ఫీజుల నియంత్రణ కమిటీ నోటీసులు జారీ చేసింది.

ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం కాకుండా ఎక్కువ ఫీజు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కమిటీ నోటీసుల్లో పేర్కొంది. కానీ, కొన్ని కాలేజీలు ప్రభుత్వ జీవో ఉల్లంఘించి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడంతో ఫీజుల నియంత్రణ కమిటీ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఫీజులు వసూలు చేస్తు్న్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు పలు కాలేజీలపై ఫిర్యాదులు చేయగా నేడు కమిటీ విచారించింది. ఈ నేపథ్యంలో 15 కాలేజీలను గుర్తించిన కమిటీ రెండు లక్షల జరిమానా విధించింది. అంతేకాకుండా, విద్యార్థుల దగ్గర తీసుకున్న వసూలు చేసిన ఫీజును తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోనున్నట్లు ఫీజుల నియంత్రణ కమిటీ తెలిపింది. కాగా, త్వరలోనే కాలేజీలు జరిమానా కట్టనున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed