పర్యటన ఖరారు.. మరోసారి హైదరాబాద్‌కు ప్రధాని మోడీ

by GSrikanth |
పర్యటన ఖరారు.. మరోసారి హైదరాబాద్‌కు ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి హైదరాబాద్ పర్యనటకు రానున్నారు. ఈనెల 10వ తేదీ నుంచి 14వ తేదీవరకు నగరంలోని హెచ్‌ఐసీసీలో జరిగే UNWGIC సదస్సులో 11వ తేదీన ప్రధాని పాల్గొనున్నారు. ఈ సమావేశం ఐక్యరాజ్య సమితి, కేంద్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో జరగనుంది. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 115 దేశాల నుంచి 550 మందికిపైగా ప్రతినిధులు దీనికి హాజరుకానున్నారు. కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్‌ సదస్సుకు సంబంధించిన వివరాలను ఇప్పటికే వెల్లడించారు. జియోస్పేషియల్‌ రంగంలో భారత్‌ సాధించిన ప్రగతిని ఈ సదస్సులో చర్చిస్తారు. ప్రధాని పర్యటన విషయమై పీఎంఓ నుంచి సోమవారం అధికారిక ప్రకటన విడుదలైంది.

Next Story