Narendra Modi : కేసీఆర్ ఫ్యామిలీపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
Narendra Modi : కేసీఆర్ ఫ్యామిలీపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో తెలంగాణ బీజేపీ మంగళవారం తలపెట్టిన ఇందూరు జనగర్జన సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ సాకారమైందని.. కానీ తెలంగాణ ప్రతిఫలాన్నీ ఒక్క కేసీఆర్ కుటుంబమే అనుభవిస్తోందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు, కూతురు మాత్రమే ధనికులయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ కుటుంబ స్వామ్యంగా మార్చారని మండిపడ్డారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి వచ్చి నన్ను కలిశారు.. తాను కూడా ఎన్డీఏ కూటమిలో చేరుతానని కేసీఆర్ అడిగారని చెప్పారు. కానీ కేసీఆర్ ఎన్డీఏ కూటమిలో కలవాడాన్ని తాను ఒప్పుకోలేదని మోడీ బయటపెట్టారు. అంతేకాకుండా తన కొడుకు కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తానని కేసీఆర్ చెప్పారని.. వారసత్వంగా ఇవ్వడానికి మీరు ఏమైనా రాజులా అని నేను ప్రశ్నించానని తెలిపారు. ప్రజలు ఆశీర్వదించిన వారే పాలకులు అవుతారని తాను చెప్పానన్నారు. దీంతో అప్పటి నుండి కేసీఆర్ తనను కలవలేదని చెప్పారు.

Next Story

Most Viewed