వారికి ప్రధాని మోడీ భారీ శుభవార్త.. ఉచిత రేషన్‌పై కీలక ప్రకటన!

by Disha Web Desk 9 |
వారికి ప్రధాని మోడీ భారీ శుభవార్త.. ఉచిత రేషన్‌పై కీలక ప్రకటన!
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రధాని మోడీ విడుదల చేశారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లు కూడా దేశ వ్యాప్తంగా పేదలకు ఉచిత రేషన్ అందిస్తామని ప్రకటించారు.70 ఏళ్లు పైబడిన వృద్ధులనూ ఆయుష్మాన్ భారత్‌లో చేరుస్తామని వెల్లడించారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టిస్తామని అన్నారు. అంతేకాకుండా మరో 3 కోట్ల ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. భవిష్యత్తులో పైపులైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ అందిస్తామని తెలిపారు. ముద్ర పథకం కింద ఇచ్చే రుణాన్ని రూ. 20 లక్షలు చేస్తామన్నారు. చిరు వ్యాపారులకు వడ్డీల బాధ తొలగిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేస్తామని మోడీ చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed