రాష్ట్రానికి చెందిన ఐదుగురు నర్సులకు ప్రతిష్టాత్మక అవార్డు

by Disha Web Desk 4 |
రాష్ట్రానికి చెందిన ఐదుగురు నర్సులకు ప్రతిష్టాత్మక అవార్డు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రానికి నైటింగేల్​ నర్సస్ ​అవార్డులు వరించాయి. ఐదుగురు నర్సులకు ప్రధానం చేశారు. ది నేషనల్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ది న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ కర్ణాటక అధ్వర్యంలో మంగళవారం జరిగిన ఇంటర్నేషల్ నర్సస్ డే వేడుకల్లో ఈ అవార్డులను అందజేశారు. నర్సింగ్ వృత్తిలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి "నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సస్ అవార్డ్ 2023" ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేతులు మీదుగా ఇచ్చారు.

మన రాష్ట్రం నుంచి బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో హెడ్ నర్సుగా పనిచేస్తున్న ఆరోగ్య జ్యోతి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రములోని సామాజిక వైద్యశాలలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న కట్కురి రాణి, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఏరియా వైద్యశాలలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న ఉపత్ ఉన్నిస, కేర్ ​హాస్పిటల్​ హైదరాబాద్​లో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ సంజుల వర్మ, సెయింట్ థెరిస్సా హాస్పిటల్​లో నర్సింగ్ ఆఫీసర్​గా పనిచేస్తున్న సరిత మేరీలు ఈ నైటింగేల్ ​అవార్డులు అందుకున్నారు.

ఆరోగ్య జ్యోతి గత పాతికేళ్ళుగా ఏరియా ఆసుపత్రిలో వైద్యసేవలు అందిస్తూనే, తన కూతురు మృతి చెందిన తరువాత ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి సేవలు కొనసాగిస్తున్నారు. జీవనశైలి వ్యాధుల నిర్ధారణకు శిబిరాలు పెడుతున్నారు. వేసవి నేపథ్యంలో ఫిబ్రవరిలో శిబిరాన్ని ఏర్పాటు చేసి 135 యూనిట్ల రక్తం సేకరించారు. కరోనా సమయంలో సరుకుల పంపిణీ, పేద విద్యార్థులకు చేయూత వంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

దీంతో పాటు క్యాన్సర్ అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. అదే విధంగా కట్కురి రాణి గత పదమూడు సంవత్సరాలుగా హెల్త్​డిపార్ట్​మెంట్‌లో పనిచేస్తున్నారు. వేల సంఖ్యలో సహజ ప్రసవాలు చేశారు. కరోనా సమయంలో ఆమె వివిధ సేవలు చేశారు. ఆమె అంకిత భావంతో పనిచేస్తున్నందున ఈ అవార్డు లభించింది. ఇక ఉపత్​ ఉన్నిస 24 ఏళ్లుగా సర్కార్​ దవాఖానలో స్టాఫ్​నర్సుగా పనిచేస్తూ నార్మల్ డెలివరీలను ప్రోత్సహిస్తున్నారు.


Next Story

Most Viewed