ప్రీతి కేసు: వరంగల్ KMC సంచలన నిర్ణయం

by Disha Web Desk 2 |
ప్రీతి కేసు: వరంగల్ KMC సంచలన నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: వరంగల్ కేఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. మెడికో ప్రీతిని వేధించిన సీనియర్ మెడికో సైఫ్‌ను యాజమాన్యం కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది. అలాగే ప్రీతిని వేధించిన కేసులో సైఫ్‌కు శిక్ష పడితే కాలేజీ నుంచి బహిష్కరణ వేటు వేస్తామని తెలిపింది. కాగా, ప్రీతి కేసుకు సంబంధించి విచారణకు నియమించిన వైద్యుల బృందం కమిటీ తన విచారణను పూర్తి చేసింది. అనంతరం నివేదికను సీల్డ్ కవర్‌లో డీఎంఈకి అందజేసింది. ఎంసీఐకి కూడా ఇదే నివేదికను పంపింది.

కాగా, కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ ఫస్టియర్ చదువుతున్న ప్రీతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. జనగామ జిల్లాకు చెందిన ప్రీతి వరంగల్‌ కేఎంసీలో పీజీ (అనస్థీషియా) చదువుతోంది. అయితే, ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణ ఉన్న ప్రీతి ఆ సమయంలో విషపూరిత ఇంజక్షన్‌ వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రీతి అపస్మారక స్థితిలో ఉండటం గమనించిన సిబ్బంది సీనియర్ వైద్యులకు సమాచారం అందించారు. అనంతరం ఆమెను ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ప్రీతి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని వైద్యులు తెలిపారు.

Next Story

Most Viewed