గ్రూప్ -2 అభ్యర్థిని ప్రవళిక సూసైడ్.. CM KCRపై రేవంత్ రెడ్డి ఫైర్ (వీడియో)

by Disha Web Desk 4 |
గ్రూప్ -2 అభ్యర్థిని ప్రవళిక సూసైడ్.. CM KCRపై రేవంత్ రెడ్డి ఫైర్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ అశోక్ నగర్‌లో గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవళిక తరపున న్యాయం కావాలని వేల గొంతులు నినదిస్తున్నా, సీఎం కేసీఆర్ చెవికి వినబడటం లేదు. ఈ పెద్ద మనిషి పాలనలో మనుషుల ప్రాణాలకు విలువ లేదు. రాక్షస పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు తప్ప యువతకు భవిత లేదు. ప్రవలిక సూసైడ్ లెటర్‌ను గమనిస్తే ఇది అర్థమవుతోంది. విద్యార్థిని ఆత్మహత్యపై ప్రభుత్వం స్పందించాలి. కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు విద్యార్థులు హాస్టల్ ఎదుట ఆందోళన చేస్తున్న వీడియో షేర్ చేశారు.

Next Story

Most Viewed