ఎంత చెప్పినా కేసీఆర్ మారడం లేదు.. చివరకు ఆయనకు పట్టే గతి అదే: కేఏపాల్

by Disha Web Desk 2 |
ఎంత చెప్పినా కేసీఆర్ మారడం లేదు.. చివరకు ఆయనకు పట్టే గతి అదే: కేఏపాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ మారకపోతే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పట్టిన గతే పడుతుందని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తాను ఎన్నిసార్లు చెప్పినా ముఖ్యమంత్రి కేసీఆర్ మారడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర గవర్నర్‌పై ఎందుకు అంత కక్ష? అని ప్రశ్నించారు. కేసీఆర్ లాయర్లకు కోట్ల డబ్బులు ఇచ్చి గవర్నర్‌పై కోర్టుకి పంపించారని విమర్శించారు. లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయకుండా వందల కోట్ల డీల్ జరుగుతోందని ఆరోపించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సీఎం కేసీఆర్ కొనలేరని, డబ్బుతో అన్నీ సాధ్యం కాదన్నారు. కేసీఆర్ కుటుంబం నష్టపోవడం ఖాయమని, కవిత అరెస్ట్ అవుతుందని తెలిపారు. ఐదు లక్షల కోట్లు అప్పు చేసింది చాలదా.. మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలా..? అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ గుండాల వ్యవహరిస్తారని, తనను అనిల్ రెడ్డితో కొట్టించారని మండిపడ్డారు. కేసులకి అరెస్టులకి భయపడను.. నా సోదరుడి హత్య కేసులో నన్ను అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారని అన్నారు.



Next Story

Most Viewed