ప్రగతి భవన్ పేరు మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

by Disha Web Desk 4 |
ప్రగతి భవన్ పేరు మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రగతిభవన్ పేరును మారుస్తూ కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకాలం ప్రగతి భవన్‌గా కొనసాగిన సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఇక నుంచి ‘మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్’గా మారుస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. పేరు మార్పు వెంటనే అమల్లోకి రానున్నట్లు ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు. గురువారం సీఎంగా ఓవైపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తుండగానే మరో వైపు ప్రగతిభవన్ వద్ద ఇనుప కంచెలను పోలీసు అధికారుల సమక్షంలో తొలిగించిన విషయం తెలిసిందే.Next Story