కేసీఆర్‌కు ‘అష్టమి’ సంకటం.. వాయిదాపడ్డ BRS ఎంపీ అభ్యర్థుల ప్రకటన..!

by Disha Web Desk 19 |
కేసీఆర్‌కు ‘అష్టమి’ సంకటం.. వాయిదాపడ్డ BRS ఎంపీ అభ్యర్థుల ప్రకటన..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి లోక్ సభ సెగ్మెంట్ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి అభ్యర్థులను ప్రకటిస్తామని పార్టీ అధిష్టానం పేర్కొంది. ఇందులో భాగంగా ఆదివారం నుంచి సమావేశాలను ప్రారంభించింది. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోనే నేతల అభిప్రాయం తీసుకున్నారు. పెద్దపల్లి లోక్ సభ అభ్యర్ధిగా కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ పేర్లను ఖరారు చేశారు. అయితే అధికారంగా ప్రకటించలేదు. కేసీఆర్ అభ్యర్థులను అధికారంగా ప్రకటించేందుకు మంచిరోజు, ముహుర్తం చూశారు.

ఏ పనిచేసే ముందు అయిన ఆయనకు తిధులు చూడటం అలవాటు. అష్టమి కావడంతో పోస్టుపోన్ చేశారు. అయితే సోమవారం మంచి రోజు కావడంతో కరీంనగర్, పెద్దపల్లి అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మీడియా సమావేశం నిర్వహించి కేసీఆర్‌గానీ కేటీఆర్‌ను గానీ ప్రకటిస్తారని తెలిసింది. అదేవిధంగా సోమవారం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నేతలతో సమావేశం నిర్వహించి తర్వాత కూడా ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని నేతలు తెలిపారు.


Next Story

Most Viewed