- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Ponnam: ఆ విషయంలో దుష్ప్రచారాలు నమ్మకండి!.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: నిమజ్జనానికి సంబంధించి ఎటువంటి అపోహలు, దుష్ప్రచారాలు నమ్మవద్దని, ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే అధికారుల దృష్టికి తీసుకురావాలని బీసీ, రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నిమజ్జన ఉత్సవాల ఏర్పాట్ల గురించి స్పందించిన ఆయన ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఇందులో 17వ తేదీ మంగళవారం హైదరాబాద్ లో జరిగే గణేష్ నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఘనంగా జరుపుంటున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగిందని చెప్పారు.
ఈ విషయంలో ఎటువంటి అపోహలు దుష్ప్రచారాలు నమ్మవద్దని, అధికారులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, అందరం కలిసి గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుపుకుందామని తెలిపారు. నిమజ్జన ఉత్సవాల్లో ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి పొన్నం సూచించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా వినాయక చతుర్ధి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో బాగంగా ఈ నెల 17న నిమజ్జన కార్యక్రమం ఉండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అంతేగాక గణేష్ నిమజ్జనం రోజున ఇప్పటికే ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది.