- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Ponnam: చిల్లర రాజకీయాలు మానుకో కేటీఆర్.. మంత్రి పొన్నం హాట్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర పాలనలో రాహుల్ గాంధీ ప్రస్తావన తేవడం కేటీఆర్ అవివేకమని, చిల్లర రాజకీయాలు మానుకోవాలని తెలంగాణ బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యల పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించిన పొన్నం.. కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా.. రాహుల్ గాంధీపై కేటీఆర్ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. చిల్లర రాజకీయాలు మాని హుందాగా వ్యవహరించాలని కేటీఆర్ కు సూచించారు. అలాగే రాష్ట్ర పరిపాలనలో రాహుల్ గాంధీ ప్రస్తావన తేవడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనమని దుయ్యబట్టారు.
అంతేగాక అసలు మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. అలాగే మూసీ బాధితులకు ప్రత్యమ్నాయం చూడకుండా ఒక ఇల్లు కూడా తీయబోము, కూలగొట్టమని స్పష్టం చేశారు. ఇక పేదల పార్టీ కాంగ్రెస్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని, వీలైతే ప్రతిపక్షం బాధ్యతతో నిర్మాణాత్మక సూచనలు చేయాలని కోరారు. కాగా తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రాను నడిపిస్తుంది రేవంత్ రెడ్డి కాదని, ఆయన వెనుక ఉండి రాహుల్ గాంధీ నడిపిస్తున్నాడని, డబ్బు సంచుల కోసమే రాహుల్ గాంధీ మూసీ ప్రాజెక్టు చేపట్టారని, పేదల ఇండ్ల పైకి బుల్డోజర్ నడిపిస్తున్నది రాహుల్ గాంధేనని సంచలన ఆరోపణలు చేశారు.