12 ఏళ్ల పాపను సేవ్ చేసిన MLA లాస్య.. ప్రమాదానికి ముందు ఏం జరిగిందో తెలుసా?

by Disha Web Desk 2 |
12 ఏళ్ల పాపను సేవ్ చేసిన MLA లాస్య.. ప్రమాదానికి ముందు ఏం జరిగిందో తెలుసా?
X

దిశ, రాచకొండ: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేయగా.. లాస్య తల్లి కీలక వ్యాఖ్యలు చేసింది. డ్రైవర్ ఆకాశ్ నిర్లక్ష్యం కారణంగానే తన కూతురు చనిపోయిందని ఆరోపణలు చేసింది. మరోవైపు లాస్య ప్రమాదం కారణంగా మృతిచెందలేదని.. మర్డర్ అని ఓ లాయర్ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం పెద్ద దుమారాన్నే రేపింది. అంతేకాదు.. లాస్యపై గతంలోనే రెండుసార్లు అటాక్‌కు ప్లాన్ చేశారని చెప్పారు. ఈ క్రమంలో ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. లాస్య మృతిపై పోలీసులు రివర్స్ ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. ప్రమాదానికి ముందు లాస్య చేసిన ఓ పని 12 ఏళ్ల పాపను రోడ్డు ప్రమాదం బారిన పడకుండా చేసింది.

వివరాల్లోకి వెళితే.. సదాశివాపేట్ నుంచి లాస్య నందిత, డ్రైవర్ ఆకాష్, ఆమె సోదరి కూతురు 12 ఏళ్ల బాలిక ఒక కారులో ప్రయాణిస్తుండగా.. మరొక కారులో లాస్య తల్లి, ఆమె సోదరి ఉన్నారు. ఈ క్రమంలో తల్లికి లాస్య ఫోన్ చేసి మీరు కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఆగాలని చెప్పింది. అక్కడ లాస్య నందిత తనకు ఆకలిగా ఉందని టిఫిన్ చేసి, మీకు కూడా తీసుకొస్తానని ఆమె కారులో ఉన్న పాపను తల్లి ప్రయాణిస్తున్న కారులో ఎక్కించింది. అనంతరం ప్రయాణం ప్రారంభించిన 21 నిమిషాలకే రోడ్డు ప్రమాదానికి గురైయి ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై డ్రైవర్‌ ఆకాశ్‌ను వివరణ కోరగా.. ఆ క్షణం అంతా బ్లాంక్ గా ఉందని, ఏం జరిగింది గుర్తుకు లేదని స్పష్టం చేసినట్లు పోలీసు వర్గాలు చెపుతున్నాయి.

Next Story