సైఫ్ రిమాండ్ మరో 2 రోజులు పొడిగింపు కోరిన పోలీసులు.. విచారణ వాయిదా వేసిన కోర్టు

by Disha Web Desk 12 |
సైఫ్ రిమాండ్ మరో 2 రోజులు పొడిగింపు కోరిన పోలీసులు.. విచారణ వాయిదా వేసిన కోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి ఆత్మ హత్యాయత్నం కేసులో నిందితుడు సీనియర్ మెడికో సైఫ్ పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో సోమవారం నిందితుడు సైఫ్‌ను పోలీసులు వరంగల్ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే సైఫ్‌ను 4 రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులు..మరో 2 రోజులపాటు రిమాండ్‌ను పొడిగించాలని న్యాయస్థానాన్ని కోరారు. కానీ, పోలీసుల నిర్ణయాన్ని జడ్జి నిరాకరించడంతో విచారణ రేపటికి వాయిదా వేశారు.

అనంతరం పోలీసులు సైఫ్‌ను ఖమ్మం జైలుకు తరలించారు. కాగా, ప్రీతిది హత్యేనని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించడంతో సైఫ్‌ను పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు అనుమతించింది. అయితే, ప్రీతిది హత్య? ఆత్మహత్యా? అనే మిస్టరీ మాత్రం విడడం లేదు. రెండు రోజుల్లో రానున్న పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలతో ప్రీతి కేసులో వివరాలు తెలిసే అవకాశం ఉందని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు.

Next Story