తెలంగాణ భవన్‌ వద్ద మీడియాకు అనూహ్య షాక్!

by Disha Web Desk 2 |
తెలంగాణ భవన్‌ వద్ద మీడియాకు అనూహ్య షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ భవన్‌లోకి పోలీసులు మీడియాను అనుమతించడం లేదు. నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన లేఖపై కేసీఆర్ సంతకం చేయనున్నారు. ఆ మరుక్షణమే బీఆర్ఎస్ పార్టీ ఉనికిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఇప్పటికే తెలంగాణ భవన్‌కు చేరుకున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మీడియాను పోలీసులు లోపలికి అనుమతించడం లేదు. మీడియా ప్రతినిధులను పోలీసులు బయటకు పంపించినట్లు సమాచారం.


Next Story

Most Viewed