- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గచ్చిబౌలి చోరీ కేసు.. గంటల్లో ఛేదించిన పోలీసులు
గచ్చిబౌలి పరిధిలో ఉన్న హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటోన్న ఓ వ్యాపారి ఇంట్లో బంగారు నగలు, వజ్రాలు చోరీకి గురయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: గచ్చిబౌలి పరిధిలో ఉన్న హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటోన్న ఓ వ్యాపారి ఇంట్లో బంగారు నగలు, వజ్రాలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు. ఆ ఇంట్లో పనిచేసే నేపాలీ దంపతుల కోసం తీవ్రంగా గాలించారు. యూపీ పోలీసుల సహకారంతో చివరికి నిందితులను పట్టుకున్నారు. వారిని అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. కిలో బంగారు నగలు, వజ్రాలను ఎత్తుకెళ్లిన నేపాలీ దంపతుల్ని అరెస్ట్ చేశారు. వీరిని సదరు వ్యాపారి నెలరోజుల క్రితమే పనిలో పెట్టుకోగా.. ఇటీవలే వ్యాపారి కుటుంబం ఓ పనినిమిత్తం ముంబైకి వెళ్లింది. వారు తిరిగివచ్చే సరికి ఇంట్లోని నగలు, వజ్రాలు కనిపించకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. నిందితుల్ని హైదరాబాద్ కు తీసుకువచ్చిన అనంతరం.. మీడియా ఎదుట హాజరు పరిచి వివరాలు వెల్లడించనున్నారు. ఆపై కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు పంపనున్నారు. ఈ ఘటనతో.. గత నెలలో జూబ్లీహిల్స్ పరిధిలో ఓ మాజీ ప్రభుత్వ అధికారి భార్యను పనిమనిషి హత్యచేసి పరారైన ఘటనను గుర్తుచేసుకుంటున్నారు. ఇంటికి పనికోసం వచ్చేవారి గురించి పూర్తిగా తెలుసుకోవాలని, వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.






