BJLP నేత ఏలేటిపై పోలీసులకు కంప్లైంట్.. కారణమిదే..!

by Rajesh |
BJLP నేత ఏలేటిపై పోలీసులకు కంప్లైంట్.. కారణమిదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై సంచలన ఆరోపణలు చేస్తూ ఇటీవల బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆర్ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్ అంటూ చేస్తున్న అలిగేషన్స్ తెలంగాణ పాలిటిక్స్‌లో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఇక, ఇదే అంశమై సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేశారని కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై వెంటనే సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలని కంప్లైంట్‌లో వారు కోరారు.

Next Story