పోలీస్ అభ్యర్థుల ఆందోళన.. కేసీఆర్​ దిష్టిబొమ్మకు వినతి పత్రం

by Disha Web |
పోలీస్ అభ్యర్థుల ఆందోళన.. కేసీఆర్​ దిష్టిబొమ్మకు వినతి పత్రం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రన్నింగ్‌లో క్వాలిఫై అయిన అభ్యర్ధులకు మెయిన్స్​రాసే అవకాశం ఇవ్వాలని హైదరాబాద్ గాంధీ భవన్​ముందు బుధవారం ధర్నా జరిగింది. వందల మంది ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళనలు నిర్వహించారు. ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులతో పాటు నిరసనలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్‌లు కూడా పాల్గొన్నారు. కేసీఆర్ ​దిష్టిబొమ్మకు వినతి పత్రం అందజేసి నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం గాంధీభవన్‌లో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు దీక్షకు దిగారు. ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ నేతృత్వంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే గాంధీ భవన్ రెండు గేట్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.


Next Story