ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద 200 మంది పోలీసులు

by karthikeya |   ( Updated:2024-09-15 06:25:52.0  )
ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద 200 మంది పోలీసులు
X

దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద మరోసారి భారీగా పోలీసులు మోహరించారు. 200 మంది పోలీసులు ఇంటి చుట్టూ పహారా కాస్తున్నారు. ఎమ్మెల్యే నివాసం ఉంటున్న సప్తగిరి కాలనీ మొత్తం పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో ఆయన ఇంటిచుట్టూ ఈ విధమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. గత నాలుగు రోజుల నుండి కాలనీ మొత్తం పోలీసులు పహారా కాస్తుండంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజు పోలీసుల మోహరింపుతో బయటికి రాలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.

Advertisement

Next Story