- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
10వేల కోట్ల రుణం కోసం ఆ భూముల తాకట్టు ఆపాలి: కేటీఆర్
దిశ వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో ఐటీ, అనుబంధ పరిశ్రమలకు కేటాయించడానికి ఉద్దేశించిన సుమారు 400 ఎకరాల విలువైన భూమిని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలకు తాకట్టు పెట్టి రూ. 10 వేల కోట్ల రుణాన్ని తీసుకోవడానికి రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నదని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ట్విటర్ వేదికగా ఆయన దీనిపై స్పందిస్తూ నగరం చుట్టుపక్కల ఐటీ, అనుబంధ రంగాల పరిశ్రమలు వచ్చి, తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పన జరగాలని.. కానీ ఈ భూములు తాకట్టు పెడితే కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేటీఆర్ తన మరో ట్వీట్ లో కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి కౌంట్ డౌన్ షురూ అయిందంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. పంటలసాగులో పంజాబ్ నే తలదన్నే స్థాయికి అనతికాలంలోనే ఎదిగామని ఆనందపడ్డామని, దశాబ్దాలపాటు దగాపడ్డ తెలంగాణ రైతన్న దేశం కడుపునింపే ఎత్తుకు ఎదిగాడని గర్వపడ్డామని, ఆర్థికంగా చితికిపోయిన అన్నదాతల బతుకులువ్యవసాయ విప్లవంతో బాగుపడ్డాయని సంబరపడ్డామని, కానీ కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి కౌంట్ డౌన్ షురూ అయిందన్నారు. పదేళ్లు పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చు మొదలైందని, తెలంగాణలో పంటల సాగు విస్తీర్ణం తగ్గడం ఇందుకు తొలి ప్రమాద హెచ్చరికని ట్వీట్ చేశారు.